Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Personal Loans: రుణం అనేది మనిషి జీవితాన్ని నెమ్మదిగా కుదేలు చేసే కనిపించని ఒక చైన్ లింక్ లాంటిది. ఒక రుణం చెల్లించడానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు మరో కొత్త వ్యక్తిగత రుణం తీసుకుని సమస్య నుంచి బయటపడాలని చాలామంది భావిస్తారు. మొదట్లో ఇది ఉపశమనంగా కనిపించవచ్చు. నెలవారీ ఈఎంఐల ఒత్తిడి తగ్గినట్టుగా అనిపించవచ్చు. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం నుంచి తాత్కాలికంగా బయటపడినామనే భావన కలగవచ్చు. కానీ వాస్తవానికి ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే కాదు. చాలా సందర్భాల్లో ఒక రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకోవడం భవిష్యత్తులో మరింత పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా క్రెడిట్ కార్డు బకాయిలు, అధిక వడ్డీతో ఉన్న రుణాలు, పెండింగ్ ఈఎంఐల భారాన్ని తగ్గించుకోవడానికి వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. ఇతర లోన్స్ తో పోలిస్తే పర్సనల్ లోన్స్ సులభంగా లభించడం, డబ్బును ఏ అవసరానికైనా వినియోగించుకునే అవకాశం ఉండటం వల్ల చాలామంది వీటికి మొగ్గు చూపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అప్పు పూర్తిగా తొలగిపోదు. కేవలం ఒక రుణాన్ని మరో రుణంతో భర్తీ చేసినట్టే అవుతుంది.
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే అప్పు భారం తగ్గకుండా కేవలం దాని రూపం మాత్రమే మారుతుంది. అధిక వడ్డీ ఉన్న రుణాన్ని తక్కువ వడ్డీ రుణంతో మార్చినా, తిరిగి చెల్లించే కాలం పెరిగితే మొత్తం చెల్లించాల్సిన డబ్బు మరింత ఎక్కువ కావచ్చు. అంతేకాదు వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు, పాత రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు వంటి అదనపు ఖర్చులు కూడా భారం పెంచుతాయి. ఫలితంగా రుణగ్రహీత అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది.
మరో ముఖ్యమైన అంశం ఖర్చు చేసే అలవాట్లు. చాలా సందర్భాల్లో సమస్య అప్పు కాదు, అదుపు లేని ఖర్చులే అసలు కారణం. కొత్త రుణంతో పాత బకాయిలను తీర్చినా, ఖర్చు చేసే విధానంలో మార్పు లేకపోతే కొంతకాలానికే మళ్లీ అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు అప్పుల నుంచి బయటపడటం మరింత కష్టంగా మారుతుంది.
అయితే కొన్ని సందర్భాలలో వ్యక్తిగత రుణం తీసుకోవడం తప్పు అని చెప్పలేం. కొన్నిసార్లు అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీతో కూడిన ఒకే రుణంగా మార్చడం ఆర్థికంగా లాభదాయకం కావచ్చు. దీనివల్ల నెలవారీ చెల్లింపులు సులభమవుతాయి. అయితే అలాంటి నిర్ణయం తీసుకునే ముందు మొత్తం ఖర్చు ఎంత తగ్గుతోంది, భవిష్యత్తులో ఆదాయం ఆధారంగా రుణాన్ని సకాలంలో చెల్లించే ప్రణాళిక ఉందా అనే అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా అయితేనే సమస్యల్లో పడకుండా జాగ్రత్త పడతారు.
దీర్ఘకాలికంగా చూస్తే అప్పుల సమస్యకు పరిష్కారం మరో అప్పు కాదు. ఆదాయం, ఖర్చులు, పొదుపులు, రుణ చెల్లింపుల మధ్య సమతుల్యత సాధించడమే అసలైన మార్గం. ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగితేనే రుణాల చక్రం నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. లేదంటే కొత్త రుణం తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, భవిష్యత్తులో మరింత భారమైన ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి లోన్ తీసుకునేముంది మీ ఆర్థక పరిస్థితిని అంచనా వేసి తీసుకోవడం మంచిది.
- Tags
- Loan Tips
- personal loans
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!