NTV Telugu Site icon

New airlines: విమాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ

Shankhairlines

Shankhairlines

దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్‌లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు శంఖ్ ఎయిర్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు డైరెక్ట్‌ సర్వీసులు తక్కువగా ఉన్న మార్గాల్లో సేవలు అందించనున్నట్లు తెలిపింది. ఎఫ్‌డీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: లడ్డూ కామెంట్స్ పై కార్తీ క్షమాపణలు.. స్పందించిన పవన్ కళ్యాణ్

ఉత్తరప్రదేశ్ నుంచి శంఖ్ తన ఎయిర్‌లైన్ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. కొత్త తరం మోడల్ అయిన బోయింగ్ 737-800 NG విమానాలతో తన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇంట్రాస్టేట్ మరియు ఇంటర్‌స్టేట్ విమానాలను అందించడం ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేయాలనుకుంటున్నట్లు ఎయిర్‌లైన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొన్ని డైరెక్ట్ ఫ్లయింగ్ ఆప్షన్‌లను అందించడంతో పాటు బలమైన డిమాండ్ ఉన్న ప్రాంతాలను కనెక్ట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం అని తెలిపింది.

ఇది కూడా చదవండి: Renukaswamy murder case: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఐటీ అధికారులు..

విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి లేఖలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డిఐ) మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి సంబంధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని శంఖ్ ఎయిర్‌కు సూచించింది. ఎయిర్‌లైన్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేయబడింది. ఇది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

ఇది కూడా చదవండి: Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..