వరుసగా నాలుగు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలున్నప్పటికీ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఓ దశలో నష్టాల్లోకి వెళ్లినా కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి. కొనుగొళ్లే సూచీలను తిరిగి పైకి లేపడం గమనార్హం. వినియోగ వస్తువులు, ఆటోమొబైల్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తితో దేశీయ సూచీలు తిరిగి గ్రీన్‌లోకి మారాయి. చమురు ధరలు 100 డాలర్ల దిగువన ట్రేడవ్వడం, యూరప్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ సానుకూలంగా ఉండడం కలిసొచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.77 శాతం, స్మాల్ క్యాప్ 0.37 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ 0.81 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.43 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం , చొప్పున పతనమయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.87 వద్ద ట్రేడవుతోంది.
State Bank Of India: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఆరంభంలోనే లాభపడినా రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54వేల దిగువనే ఉంది. 30 షేర్ల బీఎస్ఈ ఇండెక్స్‌లో, హెచ్‌యూఎల్, టైటాన్, మారుతీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సి, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటిసి తమ షేర్లు 2.87 చొప్పున పెరిగి టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, టాటా స్టీల్, పౌగ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసిఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. ఇంకా, దేశంలో అతిపెద్ద బీమా సంస్థ మరియు అతిపెద్ద దేశీయ ఆర్థిక పెట్టుబడిదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు 0.51 శాతం పడిపోయి రూ.708.55 వద్ద ముగిశాయి.
