Stock Market Crash: మార్కెట్‌లో మంటలు.. లక్షల కోట్లు ఆవిరి! సెన్సెక్స్ పతనానికి అసలు కారణం ఇవే!
- ఒక్కరోజే 1,353 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- 422.05 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. వారారంభంలోనే దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. రోజంతా తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్, చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, ఇన్వెస్టర్లకు మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. ఒకానొక దశలో 2,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే సమయానికి 1,352.74 పాయింట్లు నష్టపోయి 77,566.16 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 422.05 పాయింట్లు కోల్పోయి 24,028.05 వద్ద ముగిసింది. ఎస్బిఐ, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు ఈ అమ్మకాల ఒత్తిడిలో భారీగా దెబ్బతిన్నాయి.
READ ALSO: Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
1. యుద్ధ భయాలు – చమురు సెగ:
అమెరికా-ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్‌కు $115కి చేరడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. హార్ముజ్ జలసంధి మూసివేత, ఖతార్, ఇరాక్ వంటి దేశాల ఉత్పత్తి కోతలు చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.
2. భారత్ దిగుమతులపై ఆందోళన:
భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
3. రూపాయి విలువ రికార్డు పతనం:
ప్రపంచ ఉద్రిక్తతల ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు క్షీణించి 92.28కి పడిపోయింది. కరెన్సీ విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.
4. విదేశీ పెట్టుబడిదారుల (FII) అమ్మకాల జోరు:
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి తమ నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే వీరు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటంతో ఈ అమ్మకాల పరంపర కొనసాగుతోంది.
5. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం:
భారత మార్కెట్ల పతనానికి అంతర్జాతీయ మార్కెట్ల పతనం తోడైంది. జపాన్ నిక్కీ (7%), దక్షిణ కొరియా కోస్పీ (7%), తైవాన్ (6%), హాంకాంగ్ హాంగ్ సెంగ్ (2%) సూచీలు భారీగా నష్టపోయాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్‌లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!
తాజావార్తలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!