SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) రంగంలో పెట్టుబడిదారులకు, పరిశ్రమకు పెద్ద ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టతను ఇచ్చింది. నాన్-డిస్క్రిషనరీ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (ND-PMS) కింద పెట్టుబడి పెట్టే క్లయింట్లు, రుణాలు పొందేందుకు తమ షేర్లను తాకట్టు పెట్టుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించకుండానే అత్యవసర నిధులను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. రిజిస్టర్డ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అయిన ‘జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సెబీ ఈ వివరణ ఇచ్చింది. PMS ఖాతాల్లోని షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనే అంశంపై కంపెనీ మార్గదర్శకాలను కోరింది.
పిఎమ్ఎస్ (PMS) అనేది నిపుణులు క్లయింట్ల తరపున స్టాక్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించే పెట్టుబడి సేవ. ఇందులో ‘నాన్-డిస్క్రిషనరీ’ మోడల్ కింద పెట్టుబడి నిర్ణయాలన్నీ క్లయింట్ మాత్రమే తీసుకుంటారు. మేనేజర్ కేవలం ఆ ట్రేడ్లను అమలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. సెబీ తన తాజా స్పష్టతలో.. ఆ షేర్లు క్లయింట్ పేరు మీదే ఉంటాయని, యాజమాన్య హక్కులు కూడా వారివే కాబట్టి, రుణాలు పొందేందుకు వాటిని కొలేటరల్‌గా అంటే హామీగా ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛ ఇన్వెస్టర్లకు ఉంటుందని తెలిపింది. అయితే.. ఈ తాకట్టు నిర్ణయం పూర్తిగా క్లయింట్ స్వంతం కావాలి. ఈ ప్రక్రియను పోర్ట్‌ఫోలియో మేనేజర్ చేసిన అప్పుగా పరిగణించబోమని.. ఎందుకంటే నిబంధనల ప్రకారం పోర్ట్‌ఫోలియో మేనేజర్లు రుణాలు తీసుకోవడం నిషేధమని సెబీ పేర్కొంది.
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
మరో కీలకమైన అంశంలో.. ఒకవేళ సదరు తాకట్టును లెండర్ అంటే రుణదాత ఇంకా క్లెయిమ్ చేయనంతవరకు, ఆ షేర్లను పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ ‘అస్సెట్స్ అండర్ మేనేజ్మెంట్’ పరిధిలోనే లెక్కించవచ్చని సెబీ అనుమతించింది. దీనివల్ల మేనేజర్ల ఏయూఎమ్ గణాంకాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అయితే.. పోర్ట్‌ఫోలియో మేనేజర్లు ఈ రుణ లావాదేవీలలో ఏ విధంగానూ భాగస్వామ్యం కాకూడదని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు లోన్ డిఫాల్ట్ అంటే.. బకాయిలు చెల్లించకపోవడం లాంటివి జరిగినప్పుడు రుణదాతలు ఆ షేర్లను మార్కెట్లో విక్రయించే హక్కు కలిగి ఉంటారు. ఇది మార్కెట్ అస్థిరతకు కారణం కావచ్చు కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ నిర్ణయం వెల్త్ మేనేజ్మెంట్ రంగానికి కొత్త ఊపును ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!