SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. నేటి నుంచే అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన కస్టమర్లకు షాకిచ్చింది.. వడ్డీ రేట్లను మరోసారి వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ని 70 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) లేదా 0.7 శాతం నుండి 14.85 శాతానికి పెంచేసింది.. ప్రస్తుత బీపీఎల్ఆర్ 14.15 శాతంగా ఉండగా.. అది 14.85 శాతానికి పెరగనుంది.. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి 70 బీపీఎస్‌లు పెంచనుంది. దీంతో వీటి ఆధారంగా బ్యాంక్ ఇచ్చే గృహ, వాహన, విద్య, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుతో పాటు బేస్ రేటును గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ సవరించిన విషయం విదితమే.. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లను ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొంది ఎస్బీఐ.
Read Also: NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు
Also Read
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
అయితే పబ్లిక్ లెండర్, ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. ఎస్బీఐ చివరిసారిగా ఎంసీఎల్ఆర్ రేట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 15న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. ప్రస్తుతం, ఓవర్‌నైట్ ఎంసీఎల్ 7.95 శాతంగా ఉండగా, నెలవారీ ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు మరియు ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు వరుసగా 8.10 శాతం మరియు 8.40 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల రుణాలు మరియు మూడేళ్ల రుణాలకు ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫిబ్రవరి 8న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన తర్వాత ఎస్బీఐ తన కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటును పెంచింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!