SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయిల కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా రూ. 1.99 లక్షలు పోగొట్టుకున్న ఒక ఎస్‌బీఐ (SBI) ఖాతాదారుడికి వినియోగదారుల కోర్టులో న్యాయం జరిగింది. బెంగళూరుకు చెందిన ప్రదోష్ కుమార్ అనే వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవం, ఆ తర్వాత ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
2022 జూలైలో ప్రదోష్‌కు ఒక ఎస్సెమ్మెస్ (SMS) వచ్చింది. “మీ కరెంటు బిల్లు కట్టలేదు, వెంటనే కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం” అన్నది ఆ మెసేజ్‌లో ఉంది. భయపడిన ఆయన, ఆ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లుగా ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, కేవలం 20 రూపాయల బిల్లు కట్టడానికి ప్రయత్నించారు. అంతే.. వెంటనే ఆయన ఖాతా నుంచి మొదట రూ. 25,000, ఆ తర్వాత రూ. 1.99 లక్షలు కట్ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఎలాంటి ఓటీపీ (OTP) రాలేదు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
- RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
ఖాతాదారుడి పోరాటం..
డబ్బులు పోయిన వెంటనే ప్రదోష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అదే రోజు ఎస్‌బీఐ హెల్ప్‌లైన్ , ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం అందించారు. బ్యాంకు స్పందించి మొదట కట్ అయిన రూ. 25,000 తిరిగి ఇచ్చింది కానీ.. పెద్ద మొత్తమైన రూ. 1.99 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఖాతాదారుడి తప్పిదం వల్లే డబ్బులు పోయాయని వాదించింది.
కోర్టు తీర్పు..
ఈ కేసు జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC) వద్దకు చేరింది. విచారణ జరిపిన కోర్టు బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. మోసం జరిగిన వెంటనే (మూడు రోజులలోపు) బ్యాంకుకు సమాచారం ఇస్తే.. ఆ నష్టానికి ఖాతాదారుడు బాధ్యుడు కాదని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. కేవలం ఒక యాప్ డౌన్‌లోడ్ చేసినంత మాత్రాన అది ఖాతాదారుడి నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది. బాధితుడికి పోయిన రూ. 1.99 లక్షలతో పాటు, అదనంగా రూ. 25,000 పరిహారం చెల్లించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు ఈ డబ్బులు చెల్లించకపోతే.. 8 శాతం వడ్డీ కూడా కట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు, మోసం జరిగితే వెంటనే స్పందిస్తే న్యాయం జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!