SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
- క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్
- న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ
- ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?. ఎస్బీఐ కార్డ్ తన రెండు ప్రముఖ క్రెడిట్ కార్డులు.. PhonePe SBI Credit Card Purple, PhonePe SBI Credit Card Select Black, రివార్డ్ పాయింట్ల విధానంలో కీలక మార్పులు తీసుకువస్తోంది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులు, బీమా ప్రీమియంలు వంటి లావాదేవీల ద్వారా ఎక్కువ రివార్డ్ పాయింట్లు సంపాదించే వినియోగదారులకు ఈ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
నెలవారీ రివార్డ్ పాయింట్లకు పరిమితి
ఇప్పటి వరకు ఈ రెండు కార్డుల ద్వారా PhonePe యాప్ లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చేసిన ఖర్చులపై రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం ఉండేది. అయితే, జూలై 1 నుంచి ప్రతి నెల సంపాదించగల రివార్డ్ పాయింట్లకు పరిమితి విధించనున్నారు. నిర్ణీత పరిమితిని దాటిన తర్వాత అదనపు రివార్డ్ పాయింట్లు లభించవు.
Also Read
- Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ పతనం.. వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?
- EPFO New SWP Scheme: EPFO కొత్త ప్రతిపాదనతో ఉద్యోగులకు ప్రయోజనమా? SWP, ట్యాక్స్ రూల్స్ ఇవే!
- Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా 'రేడియం పౌడర్' మిక్స్..
- Gold Prices: వారంలోనే భారీగా పతనమైన గోల్డ్ ధరలు.. బంగారానికి మళ్లీ బలం చేకూరుతుందా? ఫుల్ క్లారిటీ..
PhonePe SBI Credit Card Purple
గతంలో నెలకు గరిష్టంగా 1,000 రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం ఉండేది.
కొత్త నిబంధనల ప్రకారం:
PhonePe లావాదేవీలపై గరిష్టంగా 750 రివార్డ్ పాయింట్లు, బీమా, యుటిలిటీ బిల్లులు, విద్యా ఫీజులు, ఆభరణాల కొనుగోళ్లు, టోల్ చెల్లింపులు వంటి కేటగిరీలపై గరిష్టంగా 250 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
PhonePe SBI Credit Card Select Black
ఈ కార్డులో గతంలో నెలకు 2,000 రివార్డ్ పాయింట్ల వరకు పొందే అవకాశం ఉండేది. ఇకపై PhonePe ద్వారా ఇతర అర్హత కలిగిన లావాదేవీలపై 1,500 రివార్డ్ పాయింట్లు
బీమా సంబంధిత ఖర్చులపై 500 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి.
Select Black కార్డ్ హోల్డర్లకు మరిన్ని పరిమితులు
నెలవారీ పరిమితితో పాటు, కొన్ని కేటగిరీల లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని SBI కార్డ్ తెలిపింది. ముఖ్యంగా PhonePe యాప్ వెలుపల జరిగే కొన్ని చెల్లింపులు ఈ మినహాయింపుల్లోకి వస్తాయి.
రివార్డ్ పాయింట్లు లభించని కేటగిరీలు
టోల్, వంతెన చెల్లింపులు
గిఫ్ట్‌లు, కానుకల కొనుగోళ్లు
ఆభరణాల కొనుగోళ్లు
విద్యా సంస్థలకు చేసే చెల్లింపులు
PhonePe యాప్ వెలుపల చేసిన యుటిలిటీ బిల్లు చెల్లింపులు
PhonePe యాప్ వెలుపల చేసిన బీమా ప్రీమియం చెల్లింపులు
PhonePe యాప్ వెలుపల నిర్వహించిన UPI లావాదేవీలు
మిగతా ఫీచర్లు యథాతథం
రివార్డ్ పాయింట్ల పరిమితులు, కొన్ని కేటగిరీల మినహాయింపులు తప్ప, PhonePe SBI Credit Card Purple, Select Black కార్డుల ఇతర ఫీచర్లు, ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ ప్రక్రియల్లో ఎలాంటి మార్పులు ఉండవని SBI కార్డ్ స్పష్టం చేసింది.
కార్డ్ హోల్డర్లు ఏమి చేయాలి?
ఈ రెండు కార్డుల్లో ఏదైనా మీ వద్ద ఉంటే, జూలై 1, 2026కు ముందు మీ రివార్డ్ పాయింట్ల బ్యాలెన్స్‌ను ఒకసారి పరిశీలించండి. అలాగే, SBI కార్డ్ విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి కొత్త నిబంధనలను అర్థం చేసుకోవడం మంచిది. భవిష్యత్తులో రివార్డ్ పాయింట్ల నష్టం జరగకుండా ఉండేందుకు మీ ఖర్చులు, బిల్లుల చెల్లింపులు, షాపింగ్ విధానాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!