Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా. కేవలం 12 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పేదరికం నీ ఎదుగుదలని ఆపలేదని, లక్ష్యం వైపు నిజాయితీగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని ఆయన జీవితం నిరూపిస్తుంది. కష్టపడే తత్వం ఉంటే సామాన్యుడు కూడా అసామాన్యుడిగా మారవచ్చని చెప్పడానికి ఈయన ఒక గొప్ప ఉదాహరణ.
గుజరాత్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సావ్జీ ధోలాకియా, చదువు మధ్యలోనే ఆపేసి కేవలం 13 ఏళ్ల వయసులో సూరత్ చేరుకున్నారు. అప్పట్లో ఆయన దగ్గర ఉన్నది కేవలం 12 రూపాయలు మాత్రమే. అది కూడా తను పుట్టిన ఊరిలో అప్పు చేసి మరీ తెచ్చుకున్నాడు. తన మామ వద్ద వజ్రాలకు మెరుగులు దిద్దే పనిలో చేరి, ఆ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. సుమారు పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పని నేర్చుకున్న తర్వాత, 1992లో తన సోదరులతో కలిసి ‘హరికృష్ణ ఎక్స్పోర్ట్స్’ అనే సంస్థను స్థాపించారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
మొదట్లో చిన్నగా మొదలైన ఈ వ్యాపారం, ధోలాకియా కష్టపడే తత్వంతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నేడు ఆయన సంస్థ విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఆయన కంపెనీ వజ్రాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
సావ్జీ ధోలాకియా కేవలం డబ్బు సంపాదించడమే కాదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. తన కంపెనీ అభివృద్ధికి కారణమైన ఉద్యోగులకు దీపావళి కానుకగా వందలాది కార్లు, ఇళ్లు, ఖరీదైన నగలు బహుమతిగా ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు కూడా వాటా ఉండాలని ఆయన నమ్ముతారు.
వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవలో కూడా ఆయన ముందుంటారు. చెరువుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. 12 రూపాయలతో మొదలై 15 వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!