Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike 2026-27: జీతాలు పెరగక చాలా రంగాల్లో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. మరికొన్ని రంగాలను ఉద్యోగాల తొలగింపు భయం వెంటాడుతుంది.. ఇక, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలను AI దెబ్బకొడుతుంది.. అయితే, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏఆన్ (Aon) తన వార్షిక సర్వేలో వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఇంధన రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. 45 పరిశ్రమలకు చెందిన 1,200కు పైగా కంపెనీల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.
ఎన్బీఎఫ్సీ రంగంలో అత్యధిక జీతాల పెంపు
2026-27లో ఎన్బీఎఫ్సీ రంగంలో ఉద్యోగుల జీతాలు 10.1 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఈ జాబితాలో ఇంధన రంగం 9.9 శాతం పెంపుతో రెండో స్థానంలో ఉండగా, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం వేతన పెంపు ఉండొచ్చని తెలిపింది. ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం, కొనసాగించడం కోసం కంపెనీలు పెట్టుబడులు పెడుతూనే ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని నివేదిక సూచించింది.
Also Read
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
- IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
దేశీయ వినియోగం, పెట్టుబడులతో కంపెనీల్లో విశ్వాసం
భారత్‌లో దేశీయ వినియోగం బలంగా ఉండటం, పెట్టుబడులు కొనసాగడం, ఎగుమతులు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల వ్యాపార విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఏఆన్ ఇండియా టాలెంట్ సొల్యూషన్స్ విభాగం అధిపతి, భాగస్వామి రూపాంక్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితులు ఉద్యోగుల్లో ప్రతిభను పెంపొందించేందుకు కంపెనీలకు తోడ్పడుతున్నాయని, అదే సమయంలో నిర్వహణ ఖర్చులను అదుపులో ఉంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల వలసలు 18 శాతానికి పెరుగుదల
జీతాల పెంపు అంచనాలు స్థిరంగా ఉన్నప్పటికీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సంస్థల్లో కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. 2026లో ఉద్యోగుల వలసల రేటు 18 శాతానికి పెరిగినట్లు ఏఆన్ సర్వే వెల్లడించింది. 2025లో ఇది 16.2 శాతంగా, 2024లో 17.1 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం కంపెనీల మధ్య పోటీ కొనసాగుతోందని సూచిస్తున్నాయి.
కంపెనీల్లో పెరుగుతున్న ఏఐ వినియోగం
కార్పొరేట్ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోందని సర్వే తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పాదకత సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్న కంపెనీల శాతం 2025లో 46.1 శాతంగా ఉండగా, 2026లో 56 శాతానికి చేరింది. దాదాపు 60 శాతం కంపెనీలు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పడంపై దృష్టి సారిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ వినియోగం, ఏఐ సంబంధిత నైపుణ్యాలకు డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఏఐ, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు అధిక వేతనాలు
ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు భారతీయ కంపెనీలు 2025తో పోలిస్తే సుమారు 10 శాతం అధిక వేతనాలు చెల్లిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై సంస్థలు పెట్టుబడులు పెంచుతున్నాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి.
కొత్త వేతన నియమావళి అమలుపైనా వివరాలు
కొత్త వేతన నియమావళి నిబంధనలను 65.4 శాతం కంపెనీలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. మరో 20.9 శాతం కంపెనీలు వచ్చే ఆరు నెలల్లో ఈ నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నాయి. మొత్తంగా 2026-27లో జీతాల పెంపు సగటున 9.1 శాతంగా ఉండొచ్చని అంచనా ఉన్నప్పటికీ, ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఉద్యోగికి ఉన్న నైపుణ్యాలు, కంపెనీ పరిస్థితులు వంటి అంశాలు వాస్తవ వేతన పెంపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..