Site icon NTV Telugu

Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

Rupee Falls

Rupee Falls

Rupee fall: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది.

Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. చరిత్రలో మొదటిసారిగా రూపాయి విలువ 92 మార్కును దాటి పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా యుద్ధ పరిస్థితుల ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై తీవ్రంగా పడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీలు భారీగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజు లావాదేవీల్లోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన దాదాపు రూ. 9.7 లక్షల కోట్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి.

IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటు.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సంభవిస్తే ప్రపంచ సరఫరా గొలుసు (Global Supply Chain) దెబ్బతింటుందనే భయం మార్కెట్లను వెంటాడుతోంది. ముఖ్యంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతుంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా ఈ ఉద్రిక్తతల వల్ల భారీగా పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version