Site icon NTV Telugu

Apple iPad: రూ. 20,000 కంటే తక్కువ ధరకే ఆపిల్ ఐప్యాడ్.. పండుగ సేల్‌ ఆఫర్

Ipad 9 Apple

Ipad 9 Apple

ఇ-కామర్స్ సైట్‌లో పండుగ సీజన్ సేల్ ప్రారంభం కానుంది. ఇందులో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్, బిగ్ బిలియన్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మీరు ఈ పండుగ పూట ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే.. 60 నుండి 80 శాతం వరకు తగ్గింపు ఉంది. పండుగ సీజన్ సేల్‌లో, ఇ-కామర్స్ సైట్‌లపై డైరెక్ట్ డిస్కౌంట్‌లతో పాటు.. బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, కూపన్‌లతో సహా అనేక ఇతర ఆఫర్‌లను కూడా పొందుతారు. మరోవైపు ఆపిల్ ఐప్యాడ్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి కొన్ని వివరాలు తెలిపారు. ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఫీచర్లు విషయానికొస్తే.. A13 బయోనిక్, 64GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది కొద్దిగా మందపాటి బెజెల్స్‌తో వస్తుంది. 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, ప్రీమియం మెటల్ బాడీని కలిగి ఉంది.

Delhi Liquor Policy Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ అరెస్ట్

Apple iPad ఫీచర్లు
డిస్ ప్లే- 10.2 అంగుళాల రెటీనా, 2160×1620 పిక్సెల్స్ రిజల్యూషన్, లైటింగ్ 500 నిట్స్
స్టోరేజ్- 64GB/256GB
ఆపరేటింగ్ సిస్టమ్- iPadOS 14
ప్రాసెసర్- A13 బయోనిక్
బ్యాక్ కెమెరా – 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా – 12 మెగాపిక్సెల్
బ్యాటరీ – 10 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్
నెట్‌వర్క్ – Wi-Fi, Wi-Fi + సెల్యులార్ (e-SIM), డ్యూయల్ బ్యాండ్ Wi-Fi (2.4GHz & 5GHz)
బ్లూటూత్ వెర్షన్- 4.2
బాక్స్లో ఏమేమీ వస్తాయంటే లైట్నింగ్ టైప్-సి కేబుల్, యుఎస్‌బి టైప్-సి అడాప్టర్

AIADMK: అన్నాడీఎంకే ఎన్డీయేతో ఎందుకు విడిపోయింది?.. పళనిస్వామి కీలక ప్రకటన

Apple iPad 9 డిజైన్
ఈసారి డిజైన్, నిర్మాణ నాణ్యత గురించి మాట్లాడితే.. ఐప్యాడ్ 9 డిజైన్ ఐప్యాడ్ 8ని పోలి ఉంటుంది. ప్రతిసారీ వలే.. ఐప్యాడ్ బాడీ మెటల్ అల్యూమినియంతో తయారు చేయబడింది. ఐప్యాడ్ మొత్తం బరువు 498 గ్రాములు ఉంటుంది. డిస్ ప్లేలో హార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది, అయితే ఆపిల్ గ్లాస్ గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఐప్యాడ్ ఎత్తు, వెడల్పులో ఎటువంటి మార్పు లేదు. దీని పరిమాణం మునుపటి మోడల్ వలె ఉంటుంది.

Exit mobile version