ఆపిల్ (Apple) ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు ఇతర ప్రసిద్ధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తూ అక్టోబర్ 3 నుండి పండగ సేల్ (దీపావళి సేల్) ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా.. ఆపిల్ కంపెనీ స్టోర్‌లలో కూడా భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ దీపావళి సేల్ ప్రయోజనం వినియోగదారులకు కంపెనీ యొక్క ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు.
ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.