RBI: డిజిటల్ లావాదేవీలకు మరింత బూస్ట్.. యూపీఐలతో క్రెడిట్ కార్డులు లింక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీని వల్ల వినియోగదారులు మరింత సులువుగా పేమెంట్స్ చేసుకునే వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పింది. యూపీఐలతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం డెబిట్ కార్టులను మాత్రమే యూపీఐలతో అనుసంధానించే వీలుంది. ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సేవలను మరింత విస్తృతం చేసేందుకుగానూ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం 26 కోట్ల మంది యూపీఐ యూజర్లు ఉన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. మే నెలలో యూపీఐ ద్వారా 10.40 లక్షల కోట్ల విలువైన 594.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకి అనుసంధానించడంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..