NTV Telugu Site icon

Reliance: బడ్జెట్‌కు ముందే రిలయన్స్‌కు భారీ షాక్.. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం

Reliance Mukesh Ambani

Reliance Mukesh Ambani

బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం రావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌లో కూడా భారీ క్షీణత కనిపించింది. దేశంలో రెండో అతిపెద్ద రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా క్షీణించింది. అయితే, గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది.

READ MORE: Kia Syros : కియా సిరోస్ ఈ 2 వేరియంట్లకు భారీ డిమాండ్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా ?

మరోవైపు దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఏకంగా రూ.58,554.88 కోట్లు పెరిగింది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్‌లో అత్యధిక పెరుగుదల కనిపించింది. టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎయిర్‌టెల్, ఐటి, హెచ్‌యుఎల్ మార్కెట్ క్యాప్‌లో పెరుగుదల కనిపించింది. గత వారం, బీఎస్‌ఈ సెన్సెక్స్ 428.87 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు (0.47 శాతం) పడిపోయింది.

READ MORE: Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..