Record Level Sales in Festive Season: స్మార్ట్‌ఫోన్ సంస్థలకు రికార్డ్ స్థాయి కొనుగోళ్ల ‘పండగ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record Level Sales in Festive Season: మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావటంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాల విలువ రికార్డ్ స్థాయిలో 61 వేల కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి 5జీ ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61 శాతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్‌ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12 శాతం పెరిగి అత్యధిక రేటైన 242 డాలర్లకు చేరనుందని వివరించింది. కస్టమర్లు సహజంగా పండుగ రోజుల్లో, స్పెషల్ అకేషన్లలో కొత్త వస్తువులు కొంటుంటారు. కొందరు దీన్ని సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తాయి.
రూ.400 కోట్ల ఫండ్ రైజింగ్
Also Read
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
బాండ్లు జారీ చేయటం ద్వారా కనీసం 400 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసేందుకు ఇండియన్ రెనివబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బాండ్లు 2025 అక్టోబర్‌లో మరియు 2032లో మెచ్యూరిటీకి రానున్నాయి. ఈ మేరకు బ్యాంకర్లతోపాటు ఇన్వెస్టర్ల నుంచి కూపన్ మరియు కమిట్మెంట్ బిడ్లను ఆహ్వానించినట్లు మూడు మర్చెంట్ బ్యాంకర్లు తెలిపారు. ఈ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా బాండ్లను జారీ చేసి ఒక బిలియన్ రూపాయలకు పైగా నిధులను సమీకరించింది.
Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
టాటా షేర్లు 6 నెలల్లో డబుల్
టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్లు ఈ ఏడాది మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఇన్వెస్టర్ల డబ్బును ఆరు నెలల్లోనే రెట్టింపు చేశాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ఈ సంస్థ.. లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సేవలందిస్తోంది. పెట్టుబడుల అమ్మకాల ద్వారా డివిడెండ్లు, వడ్డీలు, లాభాల రూపంలో సంస్థ ఆదాయం పెరుగుతుండటంతో షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ వద్ద పెట్టుబడుల కంపెనీగా నమోదైన ఈ సంస్థ తన ఇన్వెస్ట్మెంట్లను లిస్టెడ్ మరియు అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, డెట్ ఇన్స్ట్రుమెంట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతోంది.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!