PPF Scheme: పోస్టాఫీస్‌లో బంఫర్ స్కీమ్.. 12,500తో రూ.40 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PPF Scheme: సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి, బిడ్డ పెళ్లి చేయాలనుకునే వారికి, కొడుకు ఉన్నత చదువు కోసం డబ్బులు ఆదా చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నాను అంటే కచ్చితంగా ఈ పొదుపు మీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలదనే భరోసాను ఇవ్వగలదు. ఇందులో పొదుపు చేస్తే మీ డబ్బులకు 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. ఇక్కడ మరోక విశేషం ఏమిటంటే ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంతకీ ఈ పథకం ఏంటి, ప్రతి నెల ఎంత పొదుపు చేయాలని అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..
రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, పన్ను ప్రయోజనాలు కోరుకునే వారికి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీ బెస్ట్. పీపీఎఫ్ అనేది కేంద్రం సపోర్ట్‌తో నడిచే ఒక పొదుపు పథకం. మీకు తెలుసా ఈ పథకం ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీని అందిస్తుంది. ప్రతి నెలా రూ.12,500 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే.. ఏడాదికి మొత్తం రూ.1.5 లక్షలు జమ అవుతాయి. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. మీరు ఈ 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు రూ.43.60 లక్షలు చేతికి వస్తాయి. ఇందులో రూ.21 లక్షల పైగా వడ్డీ రూపంలోనే వస్తుంది.
చాలా సింపుల్..
చిన్న మొత్తాలతో దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు రావాలనుకునే వారికి పీపీఎఫ్ ఒక అద్భుతమైన ఆప్షన్. డిజిటల్ యుగం కాబట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ ద్వారా పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఖాతాను ఫోన్‌లో తెరుచుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరవాలి. తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుంచి పీపీఎఫ్ ఖాతాకు రూ.12,500 ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మెచ్యూరిటీ సమయంలో మీరు పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.
మీకు తెలుసా..
కేంద్రం హామీ ఇస్తుంది కాబట్టి పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నీ పూర్తిగా పన్ను రహితం. ఇది ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద వర్తిస్తుంది. ఈ పథకం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. ఇక్కడ మరో వెసులుబాటు ఉంది.. ఒకేసారి లేదా నెలవారీ 12 వాయిదాలలో డబ్బును జమ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన 3, 6 ఏళ్ల మధ్య మీ డిపాజిట్‌పై తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు.
READ ALSO: Kaveri Engine: చరిత్ర సృష్టించే దిశగా భారత్.. సక్సెస్ అయితే నయా రికార్డే!
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!