ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. కోవిడ్ ప్రభావం నుంచి బయటపడిన కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో జనం ముందుకి వస్తున్నాయి. ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో కొన్ని మోడళ్లకు మాత్రం ఉన్న డిమాండ్, గిరాకీ మాత్రం అంతగా తగ్గలేదు. పైగా వాటికి సేల్స్ అధికంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
విదేశీ బ్రాండ్ Poco X4 GT లాంచ్ త్వరలోనే భారత్ లో ఉండవచ్చంటున్నారు నిపుణులు. Poco X4 GT కి సంబంధించి కొన్ని లీక్ లు బయటకు వస్తున్నాయి. Poco X4 GTని Redmi Note 11T ప్రోగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ మోడల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ధర విషయాలు పూర్తిగా అందుబాటులో లేవు. రూ.18999 వరకూ ధర వుండవచ్చని తెలుస్తోంది.
Poco X4 GT స్పెసిఫికేషన్లు
* 8GB + 256GB స్టోరేజ్ లలో లభ్యం
*20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా
*ట్రిఫుల్ రేర్ కెమేరా, 48 ఎంపీ ప్రైమరీ కెమేరా
*సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 2 ఎంపీ సెన్సార్
* Poco X4 GT టర్బో-లెవల్ పనితీరు
* ఫోన్ 6.6-అంగుళాల FHD+ 144Hz డిస్‌ప్లే
* MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్
* 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ
* 5000 mAh బ్యాటరీ సామర్థ్యం
*ధర రూ.18,999
