Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pension Scheme: పొదుపు చిన్నదైనా భవిష్యత్ పెద్దదే… నెలకు ఖర్చయ్యే ఒక టీ ధరతో మొదలయ్యే పెట్టుబడి… వృద్ధాప్యంలో ప్రతి నెలా ఖచ్చితమైన ఆదాయం అందించే భరోసా… ఇదంతా ఏదైనా ప్రైవేట్ స్కీమ్ కాదు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రత్యేక పథకం. అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, గృహ కార్మికులు, చిన్న దుకాణాలు నిర్వహించే వారు వంటి అనేక మంది భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుందో అనే ఆందోళనతో జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాంధన్ యోజన వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ అందించే భద్రతా వలయంగా నిలుస్తోంది.
Also Read
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
- Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
ఈ పథకంలో చేరాలంటే అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే నెలవారీ ఆదాయం 15 వేల రూపాయలకు మించకూడదు. ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందుతూ ఉండకూడదు. అంతేకాదు ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు.
ఈ పథకంలోని అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, మీరు ఎంత మొత్తం జమ చేస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మీ తరఫున జమ చేస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరిన వ్యక్తి నెలకు 55 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం కూడా మరో 55 రూపాయలు జమ చేస్తుంది. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి చందా మొత్తం మారుతుంది.
ఈ విధంగా నిరంతరం చందా చెల్లించిన సభ్యులు 60 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక ప్రతి నెలా 3 వేల రూపాయల పెన్షన్ పొందుతారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరితే ఇద్దరికీ విడివిడిగా పెన్షన్ లభిస్తుంది. అంటే కుటుంబానికి నెలకు మొత్తం 6 వేల రూపాయల వరకు ప్రయోజనం అందుతుంది.
ఈ పథకంలో చేరాలని భావించే వారు సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. అక్కడ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి నమోదు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఒకసారి నమోదు అయిన తర్వాత ప్రతి నెలా చందా మొత్తాన్ని ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మొత్తం డెబిట్ అవుతుంది.
అంతేకాదు ఈ పథకంలో కుటుంబ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యుడు 60 ఏళ్ల తర్వాత మరణిస్తే, అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి నెలకు 1,500 రూపాయల పెన్షన్ కొనసాగుతుంది. అంటే ప్రధాన పెన్షన్‌లో సగం మొత్తాన్ని జీవిత భాగస్వామి పొందే అవకాశం ఉంటుంది.
నెలకు కేవలం 55 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ ప్రభుత్వ పథకం, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఒక భరోసా పథకంగా నిలుస్తోంది. చిన్న మొత్తంతో మొదలయ్యే ఈ పెట్టుబడి, భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!