High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- హైకోర్టుల్లో కొత్త చీఫ్ జస్టిస్‌లు
- ఎవరు ఎక్కడ నియమితులయ్యారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 High Courts Get New Chief Justices: కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు హైకోర్టుల్లో 8 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను (Chief Justices) నియమించింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజులకే ఈ నియామకాలు జరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కొత్త నియామకాలతో పట్నా, కలకత్తా, రాజస్థాన్, బాంబే, పంజాబ్-హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్-లడఖ్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల మార్పులు చోటుచేసుకోనున్నాయి.
8 మంది కొత్త చీఫ్ జస్టిస్‌లు వీరే
1. జస్టిస్ వల్లూరి కామేశ్వర్ రావు
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వల్లూరి కామేశ్వర్ రావును పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
2. జస్టిస్ రవీంద్ర వి. ఘుగే
బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ రవీంద్ర వి. ఘుగేను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
3. జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్ ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
4. జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి
అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠిను బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
5. జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా
పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రాను అదే పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
6. జస్టిస్ కృష్ణ రామ్ మొహపాత్ర
ఒడిశా హైకోర్టుకు చెందిన జస్టిస్ కృష్ణ రామ్ మొహపాత్రను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
7. జస్టిస్ అల్పేశ్ యశ్వంత్ కోగ్జే
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్పేశ్ యశ్వంత్ కోగ్జేను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
8. జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటి
రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటిను జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల తర్వాత నియామకాలు
ఈ నియామకాలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా వెల్లడైంది. దేశంలోని పలు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల పదవులకు సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నియామకాలు జరిగాయి. కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకంతో ఆయా హైకోర్టుల్లో పరిపాలనా వ్యవహారాలు, న్యాయపరమైన బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!