Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mugguru Kothulu Song: టాలీవుడ్లో చిన్న సినిమాలు, డిఫరెంట్ టైటిల్స్, ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నంతో వార్తల్లో నిలుస్తున్న మూవీ ‘ముగ్గురు కోతులు’. పేరు వినగానే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనిపించినా, ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథ కూడా ఉందని రీసెంట్ గా రిలీజ్ అయిన పాట వింటే తెలుస్తోంది. తేజ కొండపల్లి, వర్షిక పాశం జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ సాగే మెలోడీ లవ్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ పాటను నిన్న రిలీజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ ఇప్పుడు సినిమాపై మరింత బజ్ తీసుకొస్తోంది. మెలోడీ పాట కావడంతో యూత్ ఆడియన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఈ సాంగ్ ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పాటను విడుదల చేసిన అనూప్ రూబెన్స్ కూడా సినిమా మంచి విజయం సాధించాలని మూవీ టీమ్ ను అభినందించారు.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో ఈ చిత్రాన్ని శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు వచ్చిన స్పందన తర్వాత ‘తిడుతున్నా కొడుతున్నా’ పాటను తీసుకురావడం ద్వారా సినిమాలో కామెడీ ట్రాక్ తో పాటు లవ్ ట్రాక్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ పాటకు ఎస్. సుహాస్ సంగీతాన్ని అందించగా, హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ఎలా మలుపులు తిరుగుతుంది అనేది మాత్రం తెరపై చూడాల్సి ఉంటుంది.
Also Read
- Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
- Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
- January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
- Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
మరోవైపు ‘ముగ్గురు కోతులు’ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత మరిన్ని ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిఫరెంట్ టైటిల్‌తో మొదటి నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ రేపిన ‘ముగ్గురు కోతులు’కు ఇప్పుడు లవ్ సాంగ్ కూడా తోడైంది. తేజ కొండపల్లి, వర్షిక పాశం మధ్య ప్రేమకథ ఎలా ఉండబోతోందనే విషయం అటుంచితే, ‘తిడుతున్నా కొడుతున్నా’ పాటలో చూపించిన తీరు మాత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
- Tags
- cinema
- Mugguru Kothulu
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!