Site icon NTV Telugu

Petrol and Diesel Prices: వాహనదారులు సిద్ధంగా ఉండండి.. వచ్చే వారమే పెంపు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. వాహనదారులు దీనికి సిద్ధంగా ఉండాలని జేపీ మోర్గాన్ సర్వే సంస్థ సూచించింది.

మరోవైపు చమురు కంపెనీలు ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయని గుర్తుచేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధరలను కూడా పెంచే అవకాశాలున్నాయని తెలిపింది. ఇండియాలో ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి తెరపడకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై మరింత భారం మోయక తప్పదు.

Exit mobile version