Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఏఐ డేటా సెంటర్ల విస్తరణ తెచ్చిపెడుతున్న భారీ ఖర్చులు ఇప్పుడు కంపెనీ జేబుకు పెద్ద కన్నమే పెడుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ కంపెనీల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుండటంతో ఒరాకిల్ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి, నగదు నిల్వలను కాపాడుకోవడానికి కంపెనీ లేఆఫ్స్ వైపు మొగ్గు చూపుతోంది. 2026 నాటికి తన రీస్ట్రక్చరింగ్ ప్రణాళికల వ్యయం ఏకంగా $2.8 బిలియన్లకు చేరుతుందని ఒరాకిల్ తాజాగా బ్లూమ్‌బెర్గ్ నివేదించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం ఉద్యోగాల తొలగింపునకు ఇచ్చే పరిహారం (సెవెరెన్స్ పే) కోసమే ఖర్చు కానుంది.
ఇప్పటికే ఈ ప్లాన్ కింద దాదాపు $2.1 బిలియన్ల ఖర్చు నమోదు కాగా, రాబోయే రోజుల్లో చేపట్టే అదనపు కోతల కోసం మరో $700 మిలియన్లను కేటాయించనుంది. నిధుల ఆదా కోసం ఈ ఏడాదే వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన ఒరాకిల్, త్వరలోనే మరొక విడత కోతలకు సిద్ధమవుతోందని బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. గతేడాది మే నాటికి అమెరికాలో 49,000 మంది, ఇతర దేశాల్లో 92,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న ఈ సంస్థ, ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవడం గమనార్హం.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మరోవైపు కంపెనీ చైర్మన్ లారీ ఎల్లిసన్‌కు సంబంధించిన ఒక కొత్త షేర్ ట్రేడింగ్ ప్లాన్ కూడా ఈ ఫైలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒరాకిల్‌లో దాదాపు 40% వాటా కలిగిన ఎల్లిసన్, జూన్ 22న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్ 24 నాటికి గరిష్టంగా 50 మిలియన్ షేర్లను విక్రయించవచ్చు. జూన్ 22న షేరు ధర $175.07 వద్ద ముగిసినప్పుడు ఈ వాటా విలువ దాదాపు $8.75 బిలియన్లుగా ఉంది. అయితే ఆ తర్వాత శుక్రవారం ముగింపు సమయానికి కంపెనీ షేర్లు 16% మేర క్షీణించాయి. వ్యాపారాల పరంగా చూస్తే లారీ ఎల్లిసన్ తన కుమారుడు డేవిడ్ ఎల్లిసన్ చేపట్టిన పలు భారీ డీల్స్‌కు ప్రధాన ఆర్థిక బలగంగా ఉన్నారు. గతేడాది పారామౌంట్ గ్లోబల్ టేకోవర్లోనూ, అలాగే డేవిడ్ నేతృత్వంలోని పారామౌంట్ స్కైడాన్స్ కార్ప్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం ప్రతిపాదించిన $110 బిలియన్ల కొనుగోలు ఆఫర్‌లోనూ ఆయన ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. డేటా సెంటర్ల వ్యయం ఒరాకిల్ స్వల్పకాలిక మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నప్పటికీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో భారీగా వస్తున్న ఏఐ ఆర్డర్లు, ఆర్డర్ బ్యాక్లాగ్ నివేదికలు కంపెనీ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి బలమైన మద్దతును అందిస్తున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!