NTV Telugu Site icon

OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి

Oppo Company

Oppo Company

OPPO Company: చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ మన దేశంలో 475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విహాన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్‌ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ వార్షిక ఎగుమతుల సామర్థ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 5జీ లాంటి నెక్‌స్ట్‌ జనరేషన్‌ టెక్నాలజీల డెవలప్మెంట్‌ పైన కూడా ఫోకస్‌ పెట్టనున్నట్లు పేర్కొంది.

5వ రోజూ ‘5జీ’ వేలం

5జీ స్పెక్ట్రం వేలం ఇప్పటికి 4 రోజులు పూర్తయింది. ఇవాళ 5వ రోజు కూడా ఆక్షన్‌ జరగనుంది. నిన్న 4వ రోజు వేలంలో 231 కోట్ల రూపాయలకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో 71 శాతానికి అప్లికేషన్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 17 రౌండ్ల వేలంలో లక్షా 49 వేల 855 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు.

Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?

ఐటీఆర్‌లకు రేపే లాస్ట్‌

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించేందుకు రేపు ఆదివారమే ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తారేమోనని ఐటీ చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు. కానీ గడువు పెంచే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో మొన్న గురువారం ఒక్క రోజే 36 లక్షలకు పైగా ఐటీఆర్‌లు వచ్చాయి.

తగ్గని ‘యూరో’ ద్రవ్యోల్బణం

యూరో జోన్‌లోని 19 దేశాల్లో వార్షిక ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతోంది. ఈ నెలలో రికార్డ్‌ స్థాయిలో 8.9 శాతానికి చేరింది. 1997 తర్వాత ఇదే అత్యధికం కావటం అక్కడి ప్రజలకు, పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. జూన్‌ నెలలో కూడా ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్‌ దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం దిగిరాకపోవటానికి ఇదే ప్రధాన కారణం.

ఓలా, ఉబర్‌ విలీనం!

క్యాబ్‌ సర్వీసుల రంగంలో టాప్‌లో నిలిచిన ఓలా, ఉబర్‌ కంపెనీలు రెండూ భవిష్యత్తులో ఒక్కటి కానున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇరు వర్గాలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓలా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆ సంస్థ సీఈఓ భవిశ్‌ అగర్వాల్‌ రీసెంటుగా ఉబర్‌ మేనేజ్మెంట్‌తో సమావేశమైనట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. ఓలా, ఉబర్‌ విలీనంపై నాలుగేళ్ల కిందట కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఫారెక్స్‌ నిల్వల పతనం

ఇండియాలో విదేశీ మారక నిల్వల పతనం కొనసాగుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 115 కోట్ల డాలర్లకు పైగా ఫారెక్స్‌ నిల్వలు తగ్గాయని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 57 వేల 156 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు వారంలో ఫారెక్స్‌ నిల్వలు భారీ స్థాయిలో 754 కోట్ల డాలర్లు పడిపోయాయి.