Offers on Cars: కారు కొనాలని చూస్తున్నారా? మంచి ఆఫర్ కోసం వేచి ఉన్నారా? నచ్చిన కారును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నా? ఇదే మీకు మంచి అవకాశం.. ఎందుకంటే.. ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు పలు మోడళ్ల కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించారు.. అయితే, ఈ ఆఫర్లు కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.. మార్చి నెలతో ముగిసిపోనున్నాయి..
ఇక, ఏ ఆటోమొబైల్ దిగ్గజం.. ఏఏ మోడల్స్ కార్లపై ఆఫర్లు ప్రకటించింది అనే విషయంలోకి వెళ్తే.. తన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది మారుతి.. వివిధ మోడల్స్‌పై ఒక్కో రకమైన ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ నెలలో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ. 52వేల తగ్గింపు.. మారుతి సియాజ్పై రూ. 28 వేలు.. ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారుపై రూ. 64వేలు, స్విఫ్ట్ పై రూ. 54వేలు, స్విఫ్ట్ డిజైర్ పై రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది మారుతి. అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై మాత్రం ఆఫర్లు ప్రకటించలేదు.
మరోవైపు హ్యుందాయ్ కార్లపై ఆఫర్ విషానికి వస్తే.. ఈ నెలలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.38 వేల వరకు, ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్, టక్సన్ వంటి ఎస్యూవీ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.. ఇక, టాటా కార్ల విషయానికి వస్తే.. ఈ నెలలో టాటా నెక్సాన్‌పై రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్, టాటా సఫారిపై రూ.45 వేల దాకా, టాటా టియాగోపై దాదాపు రూ. 28 వేల వరకు, టాటా టిగోర్‌పై రూ. 30వేల దాకా, టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా ఆఫర్లు ఉన్నాయి.. మొత్తంగా మూడు సంస్థలు మార్చి నెలలో ఆఫర్లు ప్రకటించాయి.. మరి ఎందుకు ఆలస్యం.. కారు కొనే ప్లాన్ ఉంటే.. ఇప్పుడే చేసుకుండో.. ఆఫర్ పట్టండి.