NTV Telugu Site icon

No charges for credit card use: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక, ఛార్జీలు లేవు..!

Upi

Upi

మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? అయితే, మీకు గుడ్‌న్యూస్‌.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాప్ నుండి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రూ.2,000 వరకు లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై రూపే క్రెడిట్ కార్డ్ వినియోగానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.. దీనిపై ఇటీవలి ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తోంది మరియు అన్ని ప్రధాన బ్యాంకులు ప్రారంభించబడ్డాయి మరియు వాణిజ్య మరియు రిటైల్ విభాగాల కోసం ఇంక్రిమెంటల్ కార్డ్‌లను జారీ చేస్తున్నాయి. రూపే క్రెడిట్ కార్డును ఉపయోగించి యూపీఐ – యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు నిర్వహించేవారికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. అయితే.. దీనికి ఒక షరతు కూడా పెట్టింది.. ఇది రూ. 2000 వరకు ట్రాన్సాక్షన్స్ చేసేవారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Read Also: Rahkeem Cornwall: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ

అంటే, లిమిట్ రూ. 2000 వేలు దాటితే మాత్రం రెగ్యులర్‌గా ఉన్నట్లే ఛార్జీలు ఉంటాయని పేర్కొంది… ఈ ఆఫర్‌తో క్రెడిట్ కార్డు వినియోగం దేశంలో పెరుగుతుందని, తద్వారా కస్టమర్లు, వ్యాపారులు కూడా లాభపడతారని అంచనా వేస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కాగా, ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు డెబిట్ కార్డులు లేదా బ్యాంకు అకౌంట్లను లింక్ చేసుకోవాల్సి ఉండేది.. క్రెడిట్ కార్డుల ఆప్షన్ లేదు.. కానీ, క్రెడిట్ కార్డుతో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా వీలు కల్పిస్తూ ఇటీవలే ఆర్బీఐ ప్రకటించింది.. దీంతో క్రెడిట్ కార్డుల వినియోగం మరింత పెరుగుతుందని ఆర్బీఐ అంచనాగా ఉంది.. అయితే.. ప్రస్తుతానికి రూపే క్రెడిట్ కార్డును ఉపయోగించుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోవైపు.. ఇప్పటికే అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు రూపే క్రెడిట్ కార్డులను ఎక్కువగా జారీ చేయడంపై ఫోకస్‌ పెట్టాయి..

అంతర్జాతీయ లావాదేవీల ఎనేబుల్‌మెంట్ కోసం, యాప్ నుండి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన సర్క్యులర్‌లో పేర్కొంది. నిల్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఈ కేటగిరీకి రూ. 2,000 కంటే తక్కువ మరియు సమానమైన లావాదేవీ మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎండీఆర్‌ అనేది ఒక వ్యాపారి తమ స్టోర్‌లలో చెల్లింపుల కోసం కార్డ్‌ని ఉపయోగించిన ప్రతిసారీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా తమ కస్టమర్‌ల నుండి చెల్లింపును అంగీకరించినందుకు బ్యాంకుకు చెల్లించే ఖర్చు. వ్యాపారి తగ్గింపు రేటు లావాదేవీ మొత్తం శాతంలో వ్యక్తీకరించబడింది. సర్క్యులర్ ప్రకారం, యూపీఐ యాప్‌లు సులభంగా యాక్సెస్ చేయగల లావాదేవీ హిస్టరీ మరియు చెల్లింపు చేసేటప్పుడు స్పష్టంగా కనిపించే వినియోగదారు ఇంటర్‌ఫేస్ ద్వారా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కస్టమర్ చేసే లావాదేవీలపై పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తాయి.