Today (06-01-23) Business Headlines: ఖమ్మంలో ‘గోద్రెజ్’ ప్లాంట్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆసక్తి ప్రదర్శించింది. ప్రపంచ స్థాయిలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేయనుంది. దీనికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఈ మేరకు ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు నిన్న గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, మీకు గుడ్‌న్యూస్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాప్ నుండి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రూ.2,000 వరకు లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై రూపే క్రెడిట్ కార్డ్ వినియోగానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.. దీనిపై ఇటీవలి ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తోంది మరియు అన్ని ప్రధాన…