Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు
- దేశానికి కీలకమైన 3Fలపై నిర్మలా వ్యాఖ్యలు
- భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, భారత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే నిరాశావాద కథనాలను ప్రచారం చేస్తున్నారని సీతారామన్ విమర్శించారు. భారత ప్రజలు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
“భారతదేశం ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే చర్యలకు తావులేదు. మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది” అని నిర్మళా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో భారీ ఆదాయ నష్టం
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి 2026లో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మూడు ముఖ్య అంశాలు ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. అవి:
ఇంధనం (Fuel)
ఎరువులు (Fertilizers)
విదేశీ మారకద్రవ్యం (Forex)
ఈ మూడు “F”లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు కూడా ఈ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె చెప్పారు.
ఎంఎస్ఎంఈల బకాయిలపై ఆందోళన
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) చెల్లించాల్సిన బకాయిలు రూ.8.1 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వాటి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేయడంలో 45 రోజుల గడువును మించకూడదని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?