Site icon NTV Telugu

RIL: భ‌ళా రిల‌య‌న్స్‌… ఆ కంపెనీలు న‌ష్ట‌పోయినా… ఆర్ఐఎల్ మాత్రం…

గ‌త‌వారం దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల‌కు గుర‌య్యాయి. అమెరికా ద్ర‌వ్యోల్బ‌ణం, ఫెడ్ రెట్లు వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపాయి. దేశీయంగా టాప్ లిస్టులో ఉన్న కంపెనీలలో రిల‌య‌న్స్ మిన‌హా మిగ‌తా అన్ని కంపెనీలు భారీ న‌ష్టాల‌ను చ‌విచూశాయి. గ‌త‌వారం టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టీసీఎస్ భారీగా న‌ష్ట‌పోగా, టాప్‌లో ఉన్న రిల‌య‌న్స్ మాత్రం భారీగా లాభప‌డింది.

Read: Job: వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ చేస్తూ రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు…

రిల‌య‌న్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 30,474.79 కోట్లు పెరిగి రూ. 16,07,857.69 కోట్ల‌కు చేరుకుంది. ఇక టీసీఎస్ రూ. 44,037.02 కోట్లు న‌ష్ట‌పోగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 13,772.72 కోట్లు న‌ష్ట‌పోయింది. హిందుస్తాన్ లీవ‌ర్ రూ. 11,818.45 కోట్లు న‌ష్ట‌పోగా, ఐసీఐసీఐ రూ. 9,574.95 కోట్లు న‌ష్ట‌పోయింది. బ‌జాజ్ ఫైనాన్స్ రూ. 8,987.52 కోట్లు న‌ష్ట‌పోగా, ఇన్పోసిస్ రూ. 8,386.79 కోట్లు న‌ష్ట‌పోయింది. భార‌తీ ఎయిర్‌టెల్ రూ. 3,157.91 కోట్లు న‌ష్ట‌పోగా, ఎస్‌బీఐ రూ. 803.21 కోట్లు న‌ష్ట‌పోయింది.

Exit mobile version