NTV Telugu Site icon

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అయితే సంక్రాంతి వేళ మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది. గత మూడు రోజులుగా వరుస లాభాల్లో సూచీలు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం లాభాలతో మొదలైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి. ముగింపులో సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 77, 042 దగ్గర ముగియగా.. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 23, 311 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూపాయిపై 19 పైసలు తగ్గి 86.55 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌కి అతిపెద్ద మద్దతుదారులు భారతీయులే.. తాజా సర్వేలో వెల్లడి..

నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ ఉండగా.. ట్రెంట్, టాటా కన్స్యూమర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా మినహా, అన్ని ఇతర రంగాల సూచీలు మెటల్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆటో 0.5-2.5 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొన తొలగింపు!

Show comments