Site icon NTV Telugu

War Effect: కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు… రూ. 8.5 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి…

ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ద‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి ర‌ష్యా బ‌ల‌గాలు చుట్టుముట్ట‌డంతో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోయాయి. అమెరికాతో పాటు యూర‌ప్ దేశాలు శాంతి కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ‌భ‌యంతో అంత‌ర్జాతీయ మార్కెట్లు కుప్ప‌కూలాయి. వాటి ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై కూడా ప‌డింది. సోమ‌వారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు న‌ష్ట‌పోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేక‌పోవ‌డంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మ‌కాలు భారీగా జ‌రిగాయి.

Read: Alcohol: శ‌రీరంపై మ‌ద్యం ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో తెలుసా…

షేర్ల అమ్మ‌కాలు వెల్లువెత్త‌డంతో మ‌దుపరుల సంప‌ద రూ. 8.5 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైంది. దేశీయంగా మార్కెట్ ప‌త‌నానికి ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు, ఏక్ష‌ణంలో అయినా యుద్ధం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వ‌స్తున్న వార్త‌లు, అమెరికాలో నెల‌కొన్న ద్ర‌వ్యోల్బ‌ణం, క్రూడాయిల్ ధ‌ర‌లు పెరగ‌డం, అంత‌ర్జాతీయంగా మార్కెట్లు న‌ష్టాల్లో ఉండ‌టం, ఆసియా మార్కెట్లు సైతం ఇదే బాట‌లో న‌డ‌వ‌డంతో దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలాయి. 2022లో ఈ స్థాయిలో మార్కెట్లు న‌ష్ట‌పోవ‌డం ఇదే మొద‌టిసారి.

Exit mobile version