NTV Telugu Site icon

Money Saving Scheme : రిస్క్ లేకుండా రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు పొందండి..

Saving Scheme

Saving Scheme

డబ్బులను పొదుపు చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే అందుకోసం ఏదైనా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఎంచుకోవాలి. అదే రిస్క్ ఉన్న పర్లేదు అనుకుంటే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. రిస్క్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..అందువల్ల మనం ఇప్పుడు రిస్క్ లేకుండా అదిరే బెనిఫిట్ కల్పించే ఒక స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… ఇందులో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.. ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం…

ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. భారీ రాబడి పొందొచ్చు. రిస్క్ ఉండదు. అంటే మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది..ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను త్రైమాసికం చొప్పున సమీక్షిస్తూ వస్తుంది. వడ్డీ రేటు స్థిరంగా కూడా ఉండొచ్చు. అందువల్ల దీని ఆధారంగా కూడా రాబడిలో కొంత మేర మార్పు ఉంటుంది. జూలై సెప్టెంబర్ కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును స్థిరంగా ఉంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలంల 15 ఏళ్లు. అయితే మీరు ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అందువల్ల దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని భావించే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి..ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు.. ఉదాహరణకు..అయితే ఈ స్కీమ్‌లో నెలకు రూ. 3000 ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. అంటే రోజుకు రు.100 పొదుపు చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 55 లక్షలు లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీరు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించాలి. అంటే మీరు 25 ఏళ్లలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే.. 60 ఏళ్ల కల్లా మీ చేతికి రూ. 55 లక్షలు వస్తాయి..అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.12.6 లక్షలు అవుతుంది.. చివరికి అన్ని బెనిఫిట్స్ కలిపి రూ.55 లక్షలను మీ సొంతం చేసుకోవచ్చు..

Show comments