Money Saving Scheme : రిస్క్ లేకుండా రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు పొందండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులను పొదుపు చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే అందుకోసం ఏదైనా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఎంచుకోవాలి. అదే రిస్క్ ఉన్న పర్లేదు అనుకుంటే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. రిస్క్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..అందువల్ల మనం ఇప్పుడు రిస్క్ లేకుండా అదిరే బెనిఫిట్ కల్పించే ఒక స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… ఇందులో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.. ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం…
ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. భారీ రాబడి పొందొచ్చు. రిస్క్ ఉండదు. అంటే మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది..ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను త్రైమాసికం చొప్పున సమీక్షిస్తూ వస్తుంది. వడ్డీ రేటు స్థిరంగా కూడా ఉండొచ్చు. అందువల్ల దీని ఆధారంగా కూడా రాబడిలో కొంత మేర మార్పు ఉంటుంది. జూలై సెప్టెంబర్ కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును స్థిరంగా ఉంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలంల 15 ఏళ్లు. అయితే మీరు ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అందువల్ల దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని భావించే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి..ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు.. ఉదాహరణకు..అయితే ఈ స్కీమ్‌లో నెలకు రూ. 3000 ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. అంటే రోజుకు రు.100 పొదుపు చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 55 లక్షలు లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీరు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించాలి. అంటే మీరు 25 ఏళ్లలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే.. 60 ఏళ్ల కల్లా మీ చేతికి రూ. 55 లక్షలు వస్తాయి..అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.12.6 లక్షలు అవుతుంది.. చివరికి అన్ని బెనిఫిట్స్ కలిపి రూ.55 లక్షలను మీ సొంతం చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!