NTV Telugu Site icon

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మరోసారి భారీగా తొలగింపు

Microsoft

Microsoft

Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది. అయితే, ఎంత మందిని తొలగించిందనే వివరాలు మాత్రం ఇంకా తెలిపలేదు.. తొలగింపులకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీని బట్టి ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ లాంటి విభాగాల్లో ఈ తొలగింపులు జరిగినట్లుగా సమాచారం.

Read Also: Anudeep:మాస్ మహారాజా సినిమా పాయె.. అనుదీప్ లైన్లోకి కుర్ర హీరో?

అయితే, తాజా తొలగింపులపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు రియాక్ట్ అయ్యారు. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సర్వ సాధారమన్నారని తెలిపారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలందించడంతో పాటుగా సంస్థ డెవలప్ మెంట్ కు ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందని అతడు చెప్పుకొచ్చారు. జూన్ 30వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగిసిన కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఈ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టడం గమనార్హం.

Read Also: Viral Video: భారత జట్టును దగ్గరగా చూడ్డానికి.. ఏకంగా చెట్టెక్కిన అభిమాని!

కాగా, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు అనేది ఇంతకు ముందు కూడా జరిగింది. ఈ ఏడాది జనవరిలో గేమింగ్ డివిజన్ లో రెండు వేల మందిపై వేటు వేశారు. ఇటీవల అజ్యూర్, మిక్స్డ్ రియాల్టీ విభాగానికి చెందిన 1000 మందిని గత నెలలో విధుల నుంచి తొలగించేసింది. తాజా తొలగింపులు అందుకు అదనం అని చెప్పొచ్చు.. గతేడాదిలో మైక్రోసాఫ్ట్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2. 32 లక్షల నుంచి 2. 227 లక్షలకు తగ్గిపోయింది. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లక్ష మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పలు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి.