NTV Telugu Site icon

Meta Layoffs: మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..

Meta

Meta

Meta Layoffs: ఫేస్‌బుక్, ఇస్టా‌గ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది. తన ఇతర సహోద్యోగులతో పాటు 5000 మందిని కూడా తొలగించినట్లు ఆమె లింక్డ్‌ఇన్ లో పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ , మెటా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక వివరాలు తెలియనప్పటికీ.. మెటాలో 6000 మంది ఉద్యోగులను తొలగిస్తారని వోక్స్ కథనం గతంలో నివేదించింది.

ఈ తొలగింపుల్లో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, సేల్స్, పార్ట్‌నర్ షిప్ ఇలా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తారని తెలుస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఏడాది మార్చిలో 10,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చారు. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు మెటా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

Read Also: IT companies: సాఫ్ట్‌వేర్ కలలకు సంక్షోభం దెబ్బ.. 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు..

సోషల్ మీడియా దిగ్గజం అయిన మెటా ఇప్పటికే రెండు సార్లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ నెలలో 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇది కంపెనీ వర్క్ ఫోర్స్ లో 13 శాతం.ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో 10,000 మందిని తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది.

ఒక్క మెటానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్యం భయాల వల్ల ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసి పారేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్, గుగూల్ కూడా ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.