Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maxwell Engineering Solutions IPO Listing: మ్యాక్స్‌వెల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలను అందించింది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 90% ప్రీమియంతో రూ.300.20 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.158గా నిర్ణయించారు. లిస్టింగ్ తర్వాత కూడా షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది.
ఈ ఐపీఓలో ఒక్కో లాట్‌కు 800 షేర్లను కేటాయించారు. కనీసం రెండు లాట్లకు దరఖాస్తు చేయాల్సి రావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.2,52,800 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. రెండు లాట్లు అంటే 1,600 షేర్లు అలాట్ అయిన వారికి లిస్టింగ్ సమయంలో పెట్టుబడి విలువ రూ.4,80,320కు చేరింది. అంటే ఒక్కో షేరుపై రూ.142.20 లాభం చొప్పున మొత్తం రూ.2,27,520 లాభం వచ్చింది. ఇది ఇష్యూ ధరతో పోల్చిన లిస్టింగ్ విలువ ఆధారంగా లెక్కించిన లాభం.
Also Read
- NPS Tatkal Scheme: తక్కువ ఆదాయం ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.10తోనే పెన్షన్ పొదుపు!
- Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా మ్యాక్స్‌వెల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ షేర్లలో ర్యాలీ కొనసాగింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే 4 శాతానికి పైగా పెరిగి ఇంట్రాడే గరిష్ఠంగా రూ.314.80 స్థాయిని తాకాయి. దీంతో ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ఈ కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.57.64 కోట్లు. పూర్తిగా ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించింది. మొత్తం 36.48 లక్షల కొత్త షేర్లను విడుదల చేసింది. ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న ఒక్క షేరును కూడా విక్రయించలేదు.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తంగా 536.80 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. అలాగే అక్టోబర్ 29న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీఓ అందుబాటులో ఉండగా, వారి నుంచి కంపెనీ రూ.16.18 కోట్లు సమీకరించింది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కంపెనీ పలు అవసరాలకు వినియోగించనుంది. కొత్త యంత్రాలు, ల్యాబ్ పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.18 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త కార్యాలయ భవనం, తయారీ కేంద్రం నిర్మాణానికి రూ.6.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉన్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించేందుకు రూ.4.30 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ.14 కోట్లు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం రూ.7.06 కోట్లు కేటాయించగా, ఐపీఓ నిర్వహణ ఖర్చులైన రూ.7.78 కోట్లను కూడా ఈ నిధుల నుంచే సర్దుబాటు చేయనుంది.
గమనిక: ఐపీఓలో లిస్టింగ్ లాభాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని హామీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, వ్యాపార వివరాలను పరిశీలించి, అవసరమైతే ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి.
తాజావార్తలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!