Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు
- నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు
- బెంగాల్‌కు ఒక్క పైసా లేదు.. చెత్త బడ్జెట్
- బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదన్న మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని… ఇందులో అసలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. చెత్త బడ్జెట్‌గా అభివర్ణించారు. బెంగాల్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
Also Read
- Smartphone Prices Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
- RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
- Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
పురులియాలోని జంగల్‌మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లేకుండానే ఆర్థిక కారిడార్ కోసం ఇప్పటికే రూ.72,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. దేశాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… బెంగాల్‌కు రావాల్సిన నిధులను లాక్కుందని ఆరోపించారు. కొత్త ఆర్థిక కారిడార్లపై చేసిన వాదనలను తోసిపుచ్చారు. ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడానికి బదులుగా ‘కఠినమైన అబద్ధాలు’ చెప్పిందని.. ‘‘మాటల గారడీ’’ ఉపయోగించిందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. 17 రకాల మందులపై కస్టమ్స్ తగ్గింపు..
బడ్జెట్లో ప్రస్తావించిన ప్రాజెక్ట్‌లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. మూడు కారిడార్ల గురించి చెప్పింది పూర్తిగా అబద్దాల చెత్తగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసినప్పటికీ.. బెంగాల్ బకాయిలను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒకే ఒక పన్ను GST ఉంది. వారు మా డబ్బును లాక్కొని.. మాకు డబ్బు ఇస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇది మా డబ్బు” అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం రూ. 2 లక్షల కోట్లకు పైగా బాకీ ఉందని.. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్ నుంచి ఏమి సేకరిస్తున్నారో.. వారు మాకు పూర్తి నిధులు ఇవ్వడం లేదు.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..