Site icon NTV Telugu

Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు

Mamata Banerjee

Mamata Banerjee

కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ‌పెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని… ఇందులో అసలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. చెత్త బడ్జెట్‌గా అభివర్ణించారు. బెంగాల్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?

పురులియాలోని జంగల్‌మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లేకుండానే ఆర్థిక కారిడార్ కోసం ఇప్పటికే రూ.72,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. దేశాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… బెంగాల్‌కు రావాల్సిన నిధులను లాక్కుందని ఆరోపించారు. కొత్త ఆర్థిక కారిడార్లపై చేసిన వాదనలను తోసిపుచ్చారు. ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడానికి బదులుగా ‘కఠినమైన అబద్ధాలు’ చెప్పిందని.. ‘‘మాటల గారడీ’’ ఉపయోగించిందని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. 17 రకాల మందులపై కస్టమ్స్ తగ్గింపు..

బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రాజెక్ట్‌లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. మూడు కారిడార్ల గురించి చెప్పింది పూర్తిగా అబద్దాల చెత్తగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసినప్పటికీ.. బెంగాల్ బకాయిలను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒకే ఒక పన్ను GST ఉంది. వారు మా డబ్బును లాక్కొని.. మాకు డబ్బు ఇస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇది మా డబ్బు” అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం రూ. 2 లక్షల కోట్లకు పైగా బాకీ ఉందని.. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్ నుంచి ఏమి సేకరిస్తున్నారో.. వారు మాకు పూర్తి నిధులు ఇవ్వడం లేదు.’’ అని అన్నారు.

Exit mobile version