LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- ఢిల్లీలో సిలిండర్ ధర రూ.202 తగ్గగా, కోల్‌కతాలో రూ.209 తగ్గింది
- కొత్త ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Price Cut August 2026: దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. ఆగస్టు నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.202 తగ్గగా, కోల్‌కతాలో రూ.209 తగ్గింది. కొత్త ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఢిల్లీలో కొత్త ధర ఎంత?
తాజా ధర తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ.2,728కు చేరింది. జూలై 1న ధర రూ.2,930గా ఉండగా, ఆగస్టు 1న మరో రూ.202 తగ్గింది. కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,872.50కు తగ్గింది. జూలైలో అక్కడ ధర రూ.3,081.50గా ఉండేది. కమర్షియల్ LPG ధరల ఈ తగ్గింపు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ధాబాలు, చిన్న ఫుడ్ బిజినెస్‌లకు కొంత ఉపశమనం కలిగించనుంది.
Also Read
- Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
- Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
- Gold Silver Rates Today: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనం.. వెండి కూడా డౌన్.. నేటి ధరలివే!
- Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
జూలైలోనూ తగ్గిన ధరలు
అంతకుముందు జూలై 1, 2026న కూడా 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఢిల్లీలో అప్పట్లో రూ.183.50, కోల్‌కతాలో రూ.174 మేర ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో ధర రూ.2,930కి, కోల్‌కతాలో రూ.3,081.50కి చేరింది.
గృహ వినియోగదారులకు ధర తగ్గింపు ఉందా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 14.2 కిలోల గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజా తగ్గింపు 19 కిలోల కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది.
వ్యాపారాలకు కొంత ఊరట
కమర్షియల్ LPG సిలిండర్ ధరల్లో వరుసగా రెండో నెలలోనూ తగ్గింపు రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, చిన్న ఆహార విక్రయ కేంద్రాలకు ఇంధన ఖర్చుల విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ఆగస్టు నెల ప్రారంభంలోనే కమర్షియల్ LPG సిలిండర్ ధరలు రూ.200కు పైగా తగ్గడం వ్యాపార వర్గాలకు శుభవార్తగా మారింది.
తాజావార్తలు
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
-
Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్..
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!