కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అందిస్తున్నారు..పోస్టాఫీస్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలు, ఎల్‌ఐసీ స్కీమ్స్ ఇందులో ఉంటాయి. ఇక ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సరికొత్త ప్లాన్ ను అందిస్తుంది.. LIC కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘ధన్ వృద్ధి’ పేరుతో లాంఛ్ చేసింది. ఆ ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం..
ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది LIC. ఈ ప్లాన్ పూర్తిగా పొదుపు, బీమా రక్షణకు పరిమితమైన నాన్- లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ. అంటే అనుకోని సంఘటన కారణంగా పాలసీదారుడు మరణిస్తే.. కుటుంబానికి ఈ పాలసీ అనేది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది… ఇకపోతే ఈ పాలసీ రూ. 1000 హామీ మొత్తంపై రూ. 75 వరకు అదనపు హామీని ఇస్తుంది. పాలసీదారు సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, పాలసీని కొనుగోలు చేసిన బీమాదారుడు రూ.1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీకి కనీస హామీ మొత్తం రూ. 1.25 లక్షలు. దీని తర్వాత 5 వేల రూపాయల వరకు పెంచుకునే వెలసుబాటు ఉంది. అయితే ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. పాలసీకి డెత్ బెనిఫిట్‌తో పాటు మెచ్యూరిటీ సమయానికి గ్యారంటీతో కూడిన బెనిఫిట్ ను పొందవచ్చు..
పాలసీదారుడు ఏదైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే రెండు అప్షన్స్ ను అందిస్తుంది.. ఇందులో మొదటి ఎంపికలో పాలసీదారుడు హామీ మొత్తం కంటే 1.25 రెట్లు లేదా రెండవ ఎంపికకు 10 రెట్లు పొందుతారు. కనీసం 90 రోజుల నుంచి 8 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ధన్ వృద్ధి పథకం తీసుకోవడానికి అర్హులు. 32 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.. ఇక ఈ పాలసీని తీసుకున్న 3 నెలల తర్వాత లోన్ పొందే అవకాశం కూడా ఉన్నట్లు ఎల్ఐసీ సంస్థ ప్రకటించింది..
ఈ ప్లాన్ మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు..ఐదు సంవత్సరాల పాటు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షిక వ్యవధిలో అందుబాటులో ఉంటుంది. సంపద వృద్ధి ప్రణాళికలు 10, 15 లేదా 18 సంవత్సరాలకు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. అంటే అతను ఎప్పుడైనా పాలసీ నుండి నిష్క్రమించవచ్చు… మొత్తం డబ్బులు అతనికి అందుతాయి.. వీటితో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..