Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.190–రూ.201గా నిర్ణయించింది. ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగియనుంది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్ల లాట్‌కు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.5గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,200 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేయనుంది. మరోవైపు కంపెనీ ప్రమోటర్ ఎం.కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.
51 నగరాల్లో 61 స్టోర్లు
లలితా జ్యువెలరీ దక్షిణ భారతదేశంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘Lalithaa’ బ్రాండ్ పేరుతో బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. మార్చి 31, 2026 నాటికి కంపెనీకి 51 నగరాల్లో మొత్తం 61 స్టోర్లు ఉన్నాయి. ఇవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిల్లో విస్తరించాయి. ఈ స్టోర్ల మొత్తం ఆపరేషనల్ ఏరియా సుమారు 6.50 లక్షల చదరపు అడుగులు. ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాలపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. మొత్తం 61 స్టోర్లలో 45 స్టోర్లు చిన్న నగరాల్లోనే ఉన్నాయి. FY26లో ఈ స్టోర్ల ద్వారా కంపెనీ ఆదాయంలో సుమారు 60.25 శాతం వచ్చింది. లలితా జ్యువెలరీకి సొంతంగా ఆభరణాల తయారీ సామర్థ్యం కూడా ఉంది. తమిళనాడులో కంపెనీ రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. చెన్నైలోని తిరుముడివక్కంలో ఉన్న యూనిట్ 43,862 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరో యూనిట్ కాంచీపురంలోని మరైమలైలో ఉంది. సొంత తయారీ కారణంగా పోటీ ధరలకు ఆభరణాలను అందించగలుగుతున్నామని కంపెనీ చెబుతోంది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
భారీగా పెరిగిన ఆదాయం, లాభం
కంపెనీ ఆర్థిక గణాంకాలు కూడా గణనీయమైన వృద్ధిని చూపిస్తున్నాయి. FY24లో రూ.16,788.05 కోట్లుగా ఉన్న ఆపరేషనల్ రెవెన్యూ.. FY26లో రూ.25,023.93 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం రూ.359.83 కోట్ల నుంచి రూ.1,009.82 కోట్లకు పెరిగింది. ఐపీఓలో నికర ఆఫర్లో గరిష్ఠంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (QIB), కనీసం 15 శాతం నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, కనీసం 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్ (Anand Rathi Advisors), ఈక్విరస్ క్యాపిటల్ లిమిటెడ్ (Equirus Capital) లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (MUFG Intime India) ఈ ఐపీఓకు రిజిస్ట్రార్‌గా ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!