Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jimmy Tata: రతన్ టాటా మరణం తర్వాత టాటా సామ్రాజ్యంలో నడుస్తున్న అంతర్గత పోరు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు నోయెల్ టాటా వర్సెస్ ట్రస్టీల మధ్యే సాగుతోందనుకున్న ఈ వివాదంలోకి.. ఎప్పుడూ తెరవెనుక ఉండే రతన్ టాటా సొంత తమ్ముడు జిమ్మీ నావల్ టాటా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. కనీసం మొబైల్ ఫోన్ కూడా వాడకుండా, పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా ఉండే ఆయన.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగి నోయెల్ టాటా తీరుపై బాంబు పేల్చడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాటా ట్రస్ట్స్ వైస్ ఛైర్మన్ విజయ్ సింగ్‌కు జిమ్మీ టాటా రాసిన లేఖ ఇప్పుడు టాటా గ్రూప్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రస్టుల ఆస్తులు ప్రజల సంక్షేమం కోసం ఉన్నవే తప్ప, ఎవరి సొంత ఆస్తులు కావని ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా నోయెల్ టాటా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ట్రస్టులలో తిష్ట వేయడంపై జిమ్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం చేతిలోకి ట్రస్టులు వెళితే, భవిష్యత్తులో టాటా సన్స్‌పైనా వాళ్ల పెత్తనమే నడుస్తుందని ఆయన హెచ్చరించారు.
అంతేకాదు, నోయెల్ టాటా కుమారుడిని ట్రస్టులో చేర్చుకోవడాన్ని వ్యతిరేకించినందుకే బోర్డు సభ్యుడు వేణు శ్రీనివాసన్‌ను టార్గెట్ చేస్తున్నారని జిమ్మీ ఆరోపించడం సంచలనంగా మారింది. 2013-14లో మార్చిన రూల్స్ వల్ల ట్రస్ట్ ఛైర్మన్‌కు వీటో పవర్ రావడంతో గ్రూప్ సమతుల్యత దెబ్బతింటోందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు టాటా సన్స్ లిస్టింగ్‌కు, ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ కొనసాగింపునకు జిమ్మీ పూర్తి మద్దతు తెలపడం నోయెల్ టాటా వర్గానికి పెద్ద షాక్‌లా మారింది. బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా, జిమ్మీ టాటా మాటకు గ్రూప్‌లో విపరీతమైన పవర్ ఉంది. ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’లోని ముగ్గురు శాశ్వత ట్రస్టీలలో ఆయన ఒకరు. అంతేకాదు, నోయెల్ టాటా తర్వాత టాటా సన్స్‌లో రెండో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు జిమ్మీనే. ఆయన వద్ద ఉన్న 0.81% షేర్ల విలువ దాదాపు రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి సంపద ఉన్నా, ఒక సాధారణ 2BHK ఫ్లాట్‌లో ఉంటూ, కేవలం పేపర్లు చదువుతూ నిరాడంబరంగా బతికే జిమ్మీ.. రతన్ టాటాకు అత్యంత ఆత్మీయుడు. అందుకే రతన్ టాటా తన వీలునామాలో జుహూ బంగ్లాలో సగం వాటాను ఆయనకే రాసిచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మౌనం వీడి నోయెల్ టాటాకు వ్యతిరేకంగా గళం విప్పడంతో.. టాటా సామ్రాజ్యంలో ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read
- Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
- Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!