Site icon NTV Telugu

IT Slow Growth: ఐటీ.. ఏదీ ఆ ఎబిలిటీ?

It Slow Growth

It Slow Growth

IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్‌. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. వేగంగా పెరుగుతున్న సరుకు వాణిజ్య లోటును మరియు కరంట్‌ అకౌంట్‌ లోటును భర్తీ చేయటంలో విఫలమవుతోంది.

మరింత ఫ్రెండ్లీగా..

ప్రభుత్వ రంగ బ్యాంకుల తనఖా ఆస్తుల ఇ-వేలం పోర్టల్ మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందనుంది. వేలానికి సంబంధించిన ప్రక్రియలన్నీ సాఫీగా జరిగేలా ఈ పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడిగా ఉన్న ఈ ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు ఎదురవుతున్నాయి. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తున్నారు.

అందంలోనే కాదు ఆదాయంలోనూ ‘టాప్‌’ లేపుతున్న హీరోయిన్లు

రూపాయి.. పడిపోయి..

అమెరికా డాలర్‌తో పోల్చితే మన కరెన్సీ రూపాయి మారకం విలువ నాలుగు వారాల కనిష్టానికి పడిపోయింది. తాజాగా నిన్న సోమవారం 0.1 శాతం తగ్గి 79.875కి చేరింది. చివరి సారిగా జులై 27వ తేదీన రూపాయి మారకం విలువ 79.125కి బక్కచిక్కిన సంగతి తెలిసిందే.

‘సౌదీ’ సిగ్నల్‌

ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉందని సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి సంకేతాలిచ్చారు. క్రూడాయిల్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌.. ద్రవ్యం కొరతతోపాటు అధిక అస్థిరతకు లోనవుతోందని తెలిపారు. పెట్రో, డీజిల్‌ రేట్లు తగ్గిపోతాయని, ఉత్పత్తి వ్యయం పెరిగి నిర్వహణ భారంగా మారుతుందని హెచ్చరించారు. ప్రపంచంలోనే టాప్‌ క్రూడాయిల్‌ ఎక్సపోర్టర్‌ అయిన సౌదీ అరేబియా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త రూల్స్‌

భారతీయుల విదేశీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ రూల్స్‌.. వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపింది. దేశీయ కార్పొరేట్లు ఇతర దేశాల్లో ఈజీగా ఇన్వెస్ట్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. ఇండియాలో లోన్లు తీసుకొని డిఫాల్ట్‌ అయినవాళ్లు, విచారణలు ఎదుర్కొంటున్నవాళ్లు నిధులను విదేశాలకు తరలించకుండా ఈ నూతన నిబంధనలు చెక్‌ పెడతాయని వెల్లడించింది.

ఐదేళ్ల గరిష్టానికి

మోటర్‌ వాహనాల విడి భాగాల తయారీ పరిశ్రమ కొవిడ్‌ పూర్వపు స్థితికి కోలుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ ఐదేళ్ల గరిష్టానికి చేరింది. 23 శాతం వృద్ధి సాధించి 4.2 లక్షల కోట్లు రూపాయలకు పెరిగింది. గతేడాది ఆటోమొబైల్‌ కాంపొనెంట్‌ ఇండస్ట్రీ టర్నోవర్‌ 3.4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కాగా 2019 నాటి రికార్డ్‌ స్థాయి గ్రోత్‌ కన్నా కూడా ఇది ఎక్కువ కావటం విశేషం.

Exit mobile version