Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 300 కోట్లు వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్.
Read Also: Travel Tips: ప్రపంచంలోనే అద్భుతమైన రోడ్లు.. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు..
చైనాలో కోవిడ్ లాక్డౌన్లు, అమెరికాతో ఉద్రిక్తతలు ఉత్పత్తిపై తీవ్రప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో తన కార్యకలాపాలను నెమ్మదిగా చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 1.2 మిలియన్ చదరపు మీటర్ల (13 మిలియన్ చదరపు అడుగులు) కొనుగోలుకు భారీగా ఖర్చు చేసినట్లు ప్రకటించారు. దాని అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ సైట్ కోసం రూ.300 కోట్లను ($37 మిలియన్లు) చెల్లిస్తోందని పేర్కొంది.
ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్ తన ప్లాంట్‌లో 2019 నుండి భారతదేశంలో ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను తయారు చేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మార్చి నెలలో మాట్లాడుతూ.. ఆపిల్ రాష్ట్రంలో కొత్త ప్లాంట్ ప్రారంభం అవుతుందని, సుమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఫాక్స్ కాన్ కర్ణాటకలో కొత్త ఫ్యాక్టరీకి సంబంధించి 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు కొద్ది రోజుల క్రితం పెట్టుబడుల విషయమై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించారు. చైనా తరువాత రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల మార్కెట్ గా ఉన్న ఇండియా దిగ్గజ కంపెనీలకు మంచి గమ్యస్థానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత్ తో ముంబై, ఢిల్లీల్లో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించారు.
