NTV Telugu Site icon

Investment-Profit: 10 వేల పెట్టుబడి. ఏడాదిలోనే 2.77 లక్షలు. అతి భారీ లాభం

Investment Profit

Investment Profit

Investment-Profit: జెన్‌సోల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన ఈ రెనివబుల్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్‌ కారును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విద్యుత్‌ కార్ల అతితక్కువ ధర 12 లక్షలు. దీంతో పోల్చితే భవిష్యత్తులో సగం రేటుకే రానుంది.

‘కెనరా’ మరోసారి

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన కెనరా బ్యాంక్‌.. టయర్‌ టు బాండ్ల రూపంలో రూ.3,500 కోట్ల వరకు నిధులను విడతల వారీగా సేకరించనుంది. ఈ మేరకు రేపు మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. వృద్ధి అవసరాలకు అనుగుణంగా మూలధన సమృద్ధి నిష్పత్తిని పెంచడం కోసం ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 డిసెంబర్‌లో కూడా ఈ బ్యాంక్‌ రూ.2,500 కోట్ల ఫండ్‌ రైజింగ్‌ చేసింది.

భారతదేశం.. బ్రాండ్‌లతో అనుబంధం..

‘చిప్‌’పైన ఫోకస్‌

దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో ఈ ఇండస్ట్రీకి అమెరికా మరియు యూరోపియన్‌ యూనియన్‌లు సైతం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం కూడా తాజాగా చిప్‌ పరిశ్రమపై ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు 2021 డిసెంబర్‌లోనే రూ.76,000 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

వాణిజ్యానికి ప్రోత్సాహం

2030 నాటికి దేశ ఎగుమతులను రెండు ట్రిలియన్‌ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా కేంద్ర వాణిజ్య విభాగం చర్యలు చేపడుతోంది. ఎగుమతుల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురానుంది. దీనికోసం వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రోత్సాహక వ్యూహాల రూపకల్పన, ఎగుమతుల లక్ష్యాల ఏర్పాటు, టార్గెట్‌లను చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర బాధ్యతలను ఈ మండలికి అప్పగించనున్నారు.

తప్పుడు ప్రచారం

లింక్డిన్‌ వేదికగా వేలాది మంది తమ కంపెనీ ఉద్యోగులుగా ప్రచారం చేసుకుంటున్నారని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ సంస్థ బినాన్స్‌ తెలిపింది. ఆ సామాజిక మాధ్యమంలోని 7,000 బినాన్స్‌ ఎంప్లాయీస్‌ ప్రొఫైల్స్‌లో సగం మాత్రమే రియల్‌ అని, మిగతా సగం ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తన ఫాలోవర్లు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సీఈఓ హెచ్చరించారు.

టవర్స్‌ ఫర్‌ సేల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌కి దేశవ్యాప్తంగా 68,000 టెలికం టవర్లు ఉండగా వాటిలో 10,000 టవర్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. తద్వారా రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 13,000 టవర్లను తప్పనిసరిగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో తొలి దశలో 10,000 టవర్లను విక్రయించేందుకు కేపీఎంజీ అనే సంస్థను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది.