Investment-Profit: 10 వేల పెట్టుబడి. ఏడాదిలోనే 2.77 లక్షలు. అతి భారీ లాభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investment-Profit: జెన్‌సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విద్యుత్ కార్ల అతితక్కువ ధర 12 లక్షలు. దీంతో పోల్చితే భవిష్యత్తులో సగం రేటుకే రానుంది.
‘కెనరా’ మరోసారి
Also Read
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్.. టయర్ టు బాండ్ల రూపంలో రూ.3,500 కోట్ల వరకు నిధులను విడతల వారీగా సేకరించనుంది. ఈ మేరకు రేపు మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. వృద్ధి అవసరాలకు అనుగుణంగా మూలధన సమృద్ధి నిష్పత్తిని పెంచడం కోసం ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 డిసెంబర్‌లో కూడా ఈ బ్యాంక్ రూ.2,500 కోట్ల ఫండ్ రైజింగ్ చేసింది.
భారతదేశం.. బ్రాండ్‌లతో అనుబంధం..
‘చిప్’పైన ఫోకస్
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఈ ఇండస్ట్రీకి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్‌లు సైతం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం కూడా తాజాగా చిప్ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 2021 డిసెంబర్‌లోనే రూ.76,000 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
వాణిజ్యానికి ప్రోత్సాహం
2030 నాటికి దేశ ఎగుమతులను రెండు ట్రిలియన్ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా కేంద్ర వాణిజ్య విభాగం చర్యలు చేపడుతోంది. ఎగుమతుల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురానుంది. దీనికోసం వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రోత్సాహక వ్యూహాల రూపకల్పన, ఎగుమతుల లక్ష్యాల ఏర్పాటు, టార్గెట్‌లను చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర బాధ్యతలను ఈ మండలికి అప్పగించనున్నారు.
తప్పుడు ప్రచారం
లింక్డిన్ వేదికగా వేలాది మంది తమ కంపెనీ ఉద్యోగులుగా ప్రచారం చేసుకుంటున్నారని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ బినాన్స్ తెలిపింది. ఆ సామాజిక మాధ్యమంలోని 7,000 బినాన్స్ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్‌లో సగం మాత్రమే రియల్ అని, మిగతా సగం ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తన ఫాలోవర్లు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సీఈఓ హెచ్చరించారు.
టవర్స్ ఫర్ సేల్
బీఎస్‌ఎన్‌ఎల్‌కి దేశవ్యాప్తంగా 68,000 టెలికం టవర్లు ఉండగా వాటిలో 10,000 టవర్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. తద్వారా రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 13,000 టవర్లను తప్పనిసరిగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో తొలి దశలో 10,000 టవర్లను విక్రయించేందుకు కేపీఎంజీ అనే సంస్థను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!