NTV Telugu Site icon

Post Office FD Scheme: బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.. వడ్డీతోనే రూ. 2.6 లక్షల లాభం!

Fd

Fd

సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో మీరు రూ. 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీతోనే రూ. 2.6 లక్షల లాభం అందుకోవచ్చు.

Also Read:Amit Shah:” నన్ను క్షమించండి” తమిళులకు అమిత్‌షా క్షమాపణలు..

పోస్టాఫీసు FD పథకానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడిపై మంచి వడ్డీ రేట్లు అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ FDలో మీరు 1 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన FDలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 1 సంవత్సరం కాలపరిమితి గల FDలో పెట్టుబడి పెడితే. మీకు 6.9 శాతం వడ్డీ రేటుతో రాబడి వస్తుంది. మీరు 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన FDలలో పెట్టుబడి పెడితే మీకు వరుసగా 7 శాతం, 7.1 శాతం, 7.5 శాతం వడ్డీ రేటుతో రాబడి అందుకోవచ్చు.

Also Read:Aadhi Pinisetty: ‘శబ్దం’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న హారర్ ఫిల్మ్: హీరో ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

పోస్ట్ ఆఫీస్ FDలో రూ. 2.6 లక్షల లాభం అందుకోవాలంటే.. 5 సంవత్సరాల కాలపరిమితితో FDలో పెట్టుబడి పెట్టవచ్చు. FDలో 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీరేటులో మెచ్యూరిటీ నాటికి మొత్తం రూ. 8,69,969 చేతికి వస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ. 2,69,969 లాభం వస్తుంది. పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే పోస్టాఫీస్ ఎఫ్డీ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు.