భారత దేశంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు కంపెనీ రూ. 2000 వరకు తగ్గింపును ఇస్తోంది..ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ‘యానివర్సరీ సేల్’ను ప్రారంభించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ కంపెనీ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 4 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ కాలంలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి, తగ్గింపు ధరపై రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఆఫర్‌కి ‘HappyIndiGoDay’ అని పేరు పెట్టింది.. ఈ సంస్థకు సంబందించిన విమాన టికెట్ లను మొబైల్, వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసేవారికి అన్ని టిక్కెట్‌లపై 12 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండగా, ఆగస్టు 4న టికెట్ బుక్‌పై 7 శాతం తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తగ్గింపు పరిమితి రూ.2,000 వరకు ఉంటుంది..
ఇకపోతే ఈ ఆఫర్ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బిసి క్రెడిట్ కార్డ్‌ల తో కూడా టైఅప్ చేసింది. దీనిపై ప్రజలు అదనపు ప్రయోజనం పొందుతారు. ఆగస్టు 2న అంటే ఈ రోజున టిక్కెట్లను బుక్ చేసుకుంటే వారికి 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కస్టమర్‌లకు, కనీస ఆర్డర్ విలువ రూ. 5,000 పై రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది.. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నప్పుడు ప్రజలు రూ. 3500 ఆర్డర్ విలువ పై 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ కార్డ్‌పై ఆఫర్ ఆగస్టు 4 వరకు చెల్లుబాటులో ఉంటుంది. గరిష్ట తగ్గింపు పరిమితి రూ.2,000. ఇది మాత్రమే కాదు.. ఇష్టమైన సీటును కూడా ఎంపిక చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..