RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ బాండ్ల రాబడులు పటిష్టమవ్వడం, డాలర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం వంటి కారణాల వల్ల భారత రూపాయి విలువ చారిత్రాత్మక పతనాన్ని చూసింది. ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ. 96.85 వద్ద ప్రారంభమై, రికార్డు స్థాయిలో రూ. 96.96 ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ. 96.83 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల రూపాయికి కొంత ఉపశమనం లభించింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ బహుముఖ చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవి చర్చల దశలోనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి.. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లను మళ్లీ ప్రారంభించడం, ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక బాండ్లను జారీ చేయడం, మరిన్ని రూపాయి-డాలర్ బై/సెల్ స్వాప్ లావాదేవీలను నిర్వహించడం అనేవి ఆర్బీఐ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఉన్నాయి.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులను చేర్చడానికి, విదేశీ మారక నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్బీఐ ఒక కీలక ప్రకటన చేసింది. మే 26న ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య 5 బిలియన్ డాలర్ల విలువైన బై/సెల్/స్వాప్ వేలం నిర్వహించనుంది. ఈ స్వాప్ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది. ఇది ఆర్బీఐ వైపు నుంచి “సింపుల్ బై/సెల్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ స్వాప్” రూపంలో ఉంటుంది. ఇందులో భాగంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ఆర్బీఐకి విక్రయించి, రూపాయిలను పొందుతాయి. అదే సమయంలో.. మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను తిరిగి కొనుగోలు చేయడానికి ఆర్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ చర్యల ద్వారా మార్కెట్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు కేంద్ర బ్యాంక్ ప్రయత్నిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!