NTV Telugu Site icon

Apple CFO: ఆపిల్ సీఎఫ్ఓగా భారత్ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్

Apple Cfo

Apple Cfo

ఆపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు. పరేఖ్ ఆపిల్‌తో 11 సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన జనవరి 1, 2025 నుంచి సీఎఫ్ఓ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ స్వయంగా ప్రకటించింది.

READ MORE: Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..

సీఎఫ్ఓగా నియమితులైన కేవన్ పరేఖ్ ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా సేల్స్, రీటైల్, మార్కెటింగ్ వ్యవహారాలు పరీక్షిస్తున్నారు. కంపెనీ ఆర్థిక వాణిజ్య విభాగంలో కేవన్ పరేఖ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సామర్థ్యం, ఫైనాన్షియల్ స్కిల్స్ గుర్తించిన ఆపిల్ కంపెనీ తదుపరి సీఎఫ్ఓగా ప్రకటించింది. కేవన్ పరేఖ్ మిచిగాన్ యూనివర్శిటీ నుంచి 1989-1993లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

READ MORE:Cabinet Decisions: 12 కొత్త స్మార్ట్ సిటీలు,10 లక్షల మందికి ఉద్యోగాలు.. కేబినెట్ నిర్ణయం..

ఆపిల్ కంపెనీ కంటే ముందు కేవన్ పరేఖ్ థామ్సన్ రాయిటర్స్ , జనరల్ మోటార్స్ కంపెనీల్లో కీలకమైన పదవుల్లో పనిచేశారు. ఫైనాన్స్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ రీజనల్ ట్రెజరర్ విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఆపిల్ కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనానలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ సీఎఫఓగా ఉన్న లూకా మేస్త్రి స్వయంగా తన తరువాత ఈ పదవికి కేవన్ పరేఖ్ సమర్ధుడని భావించి సిద్ధం చేశారు. సీఎఫ్ఓ నుంచి తప్పుకున్న తరువాత కూడా లూకా మేస్త్రి ఆపిల్ కంపెనీలో కొనసాగనున్నారు.